Kachagani Madhusudan

My photo
HYDERABAD, TELANGANA, India
Welcome to motivationaldriveship, my very own passion project filled with unique and engaging content. Explore my site and all that I have to offer; perhaps motivationaldriveship will ignite your own passions as well. Thanks& Regards Kachagani madhusudan

Wednesday, 12 September 2018

వినాయక ఆవిర్భావం - రహస్యం

మన శాస్త్ర, పురాణములలో మన పూర్వికులు, ఋషులు, మునులు చెప్పిన కధలు, సంఘటనలు మనస్సుకు హత్తుకునే విధంగా, ఆలోచింప చేసే విధంగా ఉంటాయి. వారు చెప్పిన ప్రతి విషయం లో ఎంతో ఖటినమైన, జటిలమైన విషయాన్ని క్రోడీకరించి చిన్న కధగా చెప్తారు, మనం అలోచించి తెలుసుకో గలిగితే, మన జన్మ ధన్యం అవుతుంది. ఇటువంటి ఒక అధ్బుతమైన విషయాన్ని వినాయక ఆవిర్భావం లో కూడా చెప్పారు.పార్వతీదేవి శక్తి స్వరూపిణి.ఆమె నలుగుపెట్టుకున్న తరువాత వచ్చిన నలుగు పిండితో ఆమె ఒక రూపాన్ని చేసింది. అంటే ఆమె శరీరంలోనుండి వచ్చిన మలినములు (కేవలం శక్తి వల్ల వచ్చే అతిశయం) ఒక రూపాన్ని తీసుకున్నది. అతనికి వినాయకుడు అని పేరు పెట్టారు. నాయకుడు తండ్రి , వినాసంభందం లేని వాడు (తండ్రితో నిమిత్తం లేకుండా జన్మించిన వాడు) అంటే శివుని నిమిత్తం లేకుండా జన్మించినవాడు. మహాదేవుడు తిరిగి వచ్చినపుడు ఆ బాలుడు శివుని గుర్తించలేదు.అంటే కేవలం అతిశయించిన శక్తి సామర్ద్యములు ఉండుటవల్ల రజోగుణం ప్రజ్వరిల్లి, జ్ఞానమును లోనికి రానివ్వకుండా అడ్డుకుంటారు. శివుడు ఆ బాలుని శిరస్సు ఖండించి లోనికి ప్రవేశించారు అంటే రజోగుణ అతిశయమును ఖండించి జ్ఞానము లోనికి ప్రవేశించినది. ఇక్కడ మరో విషయం గుర్తుంచుకోవాలి తల్లి తన పుత్రునిలో లోపములను, దోషములను కూడా ప్రేమించగలదు, కానీ తండ్రి అతని పుత్రుల లోని అజ్ఞానాన్ని చూసి ఊరుకోలేడు, ఊరుకోకూడదు కూడా. అది అతని ధర్మం. కనుకనే పుత్రుని దండించవలసిన అవసరం ఆదిపిత అయిన శివుని భాద్యత. ఉత్తరం వైపునకు తల పెట్టి పడుకున్న జీవి తల మనకు శాస్త్రముల ప్రకారం, చనిపోయిన లేదా తాము మరణమును ఆహ్వానిస్తున్నాము అనే వారు తప్ప ఎవరూ ఉత్తర దిశకు తలపెట్టి పడుకోరు. కాబట్టి తామంత తాము శిరస్సు ఇవ్వటానికి సిధమైన వారి నుండి శిరస్సుని తీసుకురమ్మని ఆజ్ఞ. ఏనుగు తల ,ఏనుగు తల మనకు జ్ఞాన శక్తి, క్రియాశక్తి (కర్మశక్తి) కి ప్రతీక, ఆ తలను బాలుని శరీరమునకు అతికించే పని స్వయంగా శివుడు చేసాడు కనుక ఇప్పుడు వినాయకుని జననం లో శివునికి కూడా భాగం కలిగినది. అంటే శక్తితో పాటు జ్ఞానం కూడా వినాయకునికి ప్రాప్తించినది. ఇప్పుడూ అతనిని వినాయకుడు అనే పిలిచారు.
ये कंटेंट UC के विचार नहीं दर्शाता

Saturday, 8 September 2018

Ganesh Chaturthi 2018 - గణేష్ చతుర్తి

గణేష్ చతుర్తి బుధవారం గణేశ అనుచరులచే గమనించబడింది మరియు ఇది ఒక మంగళవారం వస్తుంది, ఇది అంకర్కర్ సంకటి చతుర్తి అని కూడా పిలుస్తారు. చైత్ర నెల యొక్క గణేశ చతుర్థి పౌర్ణమి తరువాత చీకటి చంద్ర దశలో (కృష్ణ పక్ష) నాలుగవ రోజున గమనించబడుతుంది, మరియు భద్రాపదే నెల (ఆగష్టు-సెప్టెంబర్) యొక్క గణేష చతుర్థీకి రెండవది గౌరవించబడుతుంది. నేటి గణేష్ చతుర్థి 2018 సంవత్సరానికి 13 చతుర్థిలో నాల్గవ స్థానంలో ఉంది.
ఈ రోజు భక్తులు వినాయకుడి పేరు, ధ్యానం, ప్రార్థనలు, మంత్రాలు ధ్యానం చేస్తూ, పూజలు, మధుఖ్, చంద్రన్ మొదలైనవాటిలో 21 తలుపులు, వినాయకుడి విగ్రహాన్ని ప్రార్థన చేస్తారు
శ్రీ వరద వినాయక కథలో గృత్స్నమడుడు తన తల్లిని శపించి, ఆమెచే ప్రతిశాపమునుపొందినట్లు చదివితిమి. "మహా బలపరాక్రమవంతుడు, త్రిలోక కంటకుడు, క్రూర రాక్షసుడు అగు కుమారుడు జన్మించుగాక" అని ఆమె శాపము. ఇది యిట్లండగా, గ్భతమదుడు అత్యంత భక్తితో విఘ్నేశ్వరుని ధ్యానించి, ఆతనిని ప్రసన్నుని చేసికొనెను. వినాయకుని వరప్రసాదమువలన, అతడు మునులలో పరమశ్రేషుడైనాడు. ఒకనాడు ఏకాగ్రతతో వినాయకుని జపమునందు మునిగి ఉండగా, అతనికి పర్వతములు సైతము అదిరిపడేటంత పెద్దధ్వనితో ఒక తుమ్ము వచ్చినది. తత్క్షణమే, తన ఎదుట ఒక బాలకుడు కనిపించెను. ముని శ్రేషుడు, "నీవు ఎవరు?" అని అడుగగా ఆ బాలకుడు, "నీ తుమ్ములో జన్మించినాను. కనుక నీవే నాకు తల్లివి, తండ్రివి" అని జవాబు చెప్పెను. ఆ బాలకుని మాటలకు ఆశ్చర్యపడిన ముని అతని శక్తియుక్తులకు సంతసించి, "గణానాంత్వా అనే గణపతి మంత్రమును ఉపదేశించెను. ఈ గణపతి మంత్రమును, ఆ బాలుడు 5 వేల సంవత్సరములు జపించెను. గణపతి సాక్షాత్కరించి, వరములను కోరుకొనుమనెను. "మూడు లోకములలోను నాకు ఎవరును ఎదురు ఉండరాదు. దేవతలు నాక్టు వశులై ఉండాలి. నేను దేనిని సంకల్పించినను అది తత్క్షణమే సిద్దించాలి, ఇహములో సుఖములనుభవించి పరములో మోక్షమును పొందాలి" అను వరములను అతడు గణపతిని కోరెను. గజాననుడు ఆ వరములను ప్రసాదించెను.
కామగమనముగల మూడు పురములను బంగారముతో, వెండితో, ఇనుముతో నిర్మించి అతనికిచ్చెను. ఆ పురములు ఒక్క శంకరునిచేత తప్ప ఎవరిచేతను ఛేదింపబడవు. నీకు త్రిపురాసురుడు అను ఖ్యాతి లభించును. శంకరుడు తన ఏకైక బాణముతో ఈ మూడు పురములను చేదించినప్పడు, నీకు ముక్తి లభించును" అని వరములను అనుగ్రహించెను. త్రిపురాసురుడు గజాననుని వలన పొందిన శక్తులతో, భూమండలమును అంతయు ఆక్రమించెను. తరువాత ఆతడు దేవలోకముపై దండయాత్రచేసెను. ఇంద్రుని ఓడించెను. అమరావతిని తనరాజ్యముగా చేసి క్రొనెను. అచ్చటినుండి, త్రిపురుడు బ్రహ్మలోకమునకు దండెత్తి వెళ్ళెను. బ్రహ్మ విష్ణువు యొక్క నాభి కమలములో లీనమైపోయెను. విష్ణువు కూడ ఆ రాక్షసునికి కనపడకుండా క్షీరసముద్రమునకు చేరెను.
ఈ విధముగా అతడు బ్రహ్మలోకమును, విష్ణులోకమును (రెండిటిని) ఆక్రమించుకొనెను. త్రిపురాసురుడు బ్రహ్మలోకమునకు తన పెద్దకుమారుడైన ప్రచండుని, విష్ణులోకమునకు తన రెండవ కుమారుడైన చండుని, అధిపతులుగా నియమించెను. ఇక శివలోకమును ఆక్రమించుకొనుటకై అతడు కైలాసమనకు వెళ్ళెను. శివుడు కూడా కైలాసమును వదలి మంథర పర్వతమునకు చేరెను. తరువాత, రసాతలము, సప్త పాతాళ లోకములు త్రిపురాసురుని వశమైనవి. ఈ కారణమున వ్యాకులత చెందిన సమస్త దేవతలకు నారద మహర్షి గణేశానుగ్రహము పొందుటయే సరియైన మార్గమని ఉపదేశించెను. అప్పుడు దేవతలందరు అత్యంత భక్తితో పరిపూర్ణ శరణాగతితో సంకటమోచన గణేశ్వరుని ప్రార్జించిరి. శంకరుడు త్రిపురాసురునిచే ఓడింపబడెను. అప్పడు నారదుడు శివునితో, "గణేశుని పూజించి ఆయన అనుగ్రహము పొందక పోవుటచేతనే ఈ పరాజయము నీకు సంభవించినది, కనుక గణేశుని పూజించి, ఆతని అనుగ్రహమును సంపాదించుకొనుము." అని చెప్పెను. అదికాక, వినాయకుడు త్రిపురాసురునకు ఇచ్చిన వరము ప్రకారము, ఆరాక్షసుడు శివునిచేతనే వధింపబడునని గూడ శంకరునకు తెలియచేసెను. అప్పడు శంకరుడు 100 సంవత్సరముల కాలము ఏకాగ్రతతో గణేశుని గూర్చి తపస్సు ఆచరించెను.
విఘ్నేశ్వరుడు ప్రసన్నుడై ఒక బాణమునిచ్చి తన సహస్రనామములను శివునకు ఉపదేశించెను. శివుడు ఆ సహస్రనామములను జపించి, త్రిపురాసురునిపై యుద్దమునకు బయలుదేరెను. అప్పడు శంకరుడు పృథ్విని రథముగాను, సూర్యచంద్రులను చక్రములుగాను, బ్రహ్మను రథసారథిగాను, వేదములను గుజ్ఞములు గాను, మేరువును ధనుస్సుగాను, విష్ణువును బాణముగాను చేసికొనెను. శంకరుడు వినాయక - అష్టకమును పఠించి, విఘ్నేనుశ్వరుని అభయముపొంది, విష్ణువు యొక్క అంశతో గూడిన పాశుపతాస్త్రమును త్రిపురాసురునిపై ప్రయోగించెను. ఆ అస్త్రముతో త్రిపురములు దహింపబడగా త్రిపురాసురుడు మరణించెను. ఆతని శరీరమునుండి ఒక తేజస్సు వెలువడి శంకరునిలో లీనమాయెను. ఆ విధముగా త్రిపురాసురుడు మోక్షమును పొందెను. ఆ రోజు కార్తిక పౌర్ణమి. ఈ విజయమునకు కారణుడైన విఘ్నేశ్వరుని స్వయముగా శంకరుడే ఆక్షేత్రమునందు ప్రతిష్టించెను. ఆ మూర్తియే ఈ మహాగణపతి. ఈ స్థలమే రంజన్ గాము.