https://www.youtube.com/watch?v=JrMJiL9FU_M
Third party image reference
రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ దుర్మరణం
Third party image reference
Original
నెల్లూరు జిల్లాలో ఓ అభిమాని వివాహ వేడుకకు హాజరయ్యేందుకు హైదరాబాద్ నుంచి ఫార్చ్యునర్ వాహనంలో బయల్దేరిన ఆయన నల్లగొండ జిల్లా అన్నెపర్తి దగ్గర ప్రమాదానికి గురయ్యారు. నార్కెట్ పల్లిలోని కామినేని హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
హరికృష్ణ మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తయ్యింది. నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రి నుంచి ఆయన పార్థీవ దేహాన్ని హైదరాబాద్‌లోని మెహదీపట్నంలో ఉన్న నివాసానికి తరలిస్తున్నారు. హరికృష్ణ పార్థివదేహం వెంట కుమారులు కళ్యాణ్‌రామ్, ఎన్టీఆర్ బయలుదేరారు. హరికృష్ణను కడసారి చూసేందుకు టీడీపీ శ్రేణులు, ఎన్టీఆర్ అభిమానులు భారీ ఎత్తున మెహదీపట్నం చేరుకుంటున్నారు.
హరికృష్ణ రోడ్డు ప్రమాదానికి గురయ్యారనే వార్త తెలియగానే ఆయన కుమారులు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ హుటాహుటిన నార్కెట్ పల్లి బయల్దేరి వెళ్లారు. తండ్రి మృతదేహాన్ని చూసి వారిద్దరూ కన్నీటి పర్యంతమయ్యారు.


No comments:
Post a Comment