స్వతంత్ర ఉద్యమం లో కొన్నిముఖ్యమైన ఘట్టాలు
సిపాయిల తిరుగుబాటు 1857
1857–-58 మధ్యకాలంలో ఉత్తర, మధ్య భారతదేశంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాట్లని 1857 సిపాయిల తిరుగుబాటుగా పరిగణిస్తారు. భారత చరిత్రకారులు ఈ తిరుగుబాట్లని 'ప్రథమ స్వతంత్ర సంగ్రామంగా భావిస్తారు
మతసమాజములు సంఘసంస్కరణ
ఆర్య సమాజము, బ్రహ్మ సమాజము మొదలైన మతసమాజములు సంఘసంస్కరణలకు మిక్కిలి కృషి చేసాయి. మతసంస్కరణలు, సాంఘిక గౌరవం మెదలయిన విషయాలలో వీరి బోధనలు జాతీయతాభావనకు పునాదులు వేసాయి. ప్రజలు తమను భారత జాతిగా గుర్తించసాగారు. స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, శ్రీ అరబిందో, సుబ్రహ్మణ్య భారతి, బంకించంద్ర ఛటర్జీ, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, రవీంద్రనాథ్ టాగూర్, దాదాభాయి నౌరోజీ మెదలయినవారి కృషి జాతి పునరుత్తేజం పట్ల, స్వేచ్ఛ పట్లా ప్రజల్లో ఇచ్ఛను వ్యాపింపజేసింది.
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ఏర్పాటు
సిపాయిల తిరుగుబాటు తరువాతి దశాబ్దాల్లో భారతదేశంలో రాజకీయ చైతన్యం హెచ్చింది. రాజకీయాలలో భారత ప్రజల వాణి విన్పించసాగింది. అంతేకాక, జాతీయస్థాయిలోను, ప్రాంతీయస్థాయిలోను అనేకులు భారత ప్రజలకు నాయకత్వం వహించసాగారు. దాదాభాయి నౌరోజీ 1867 లో ఈస్ట్ ఇండియా ఆసోసియేషన్ (తూర్పు భారతీయ సంఘం ) బు స్థాపించాడు. 1867 లో సురేంద్రనాథ్ బెనర్జీ ఇండియన్ నేషనల్ అసోసియేషన్ (భారత జాతీయ సంఘం) స్థాపించాడు. పదవీవిరమణ చేసిన బ్రిటీష్ ప్రభుత్వ ఉద్యోగి అలన్ ఆక్టేవియస్ హ్యూమ్ ప్రోత్సాహంతో బొంబాయి (ముంబాయి) లో సమావేశమైన 73 మంది భారత ప్రతినిధులు భారత జాతీయ కాంగ్రెస్ని స్థాపించారు
తిలక్ మార్గాలు అతివాద మార్గాలుగా భావింపబడ్డాయి. ప్రజలు, బ్రిటిషు వారిపై తిరుగబడటమే స్వరాజ్య సాధనా మార్గంగా భావించారాయన. బ్రిటిషు వారివైన అన్ని వస్తువులను త్యజించాలని పిలుపునిచ్చారు. బిపిన్ చంద్ర పాల్, లాలా లజపతి రాయ్ వంటి వర్ధమాన ప్రజానాయకులు ఆయనను సమర్ధించారు. ఈ ముగ్గురూ "లాల్, బాల్, పాల్"గా ప్రసిధ్ధులు. భారత దేశపు అతి పెద్ద రాష్ట్రాలైన మహారాష్ట్ర, బెంగాల్, పంజాబులు భారత ప్రజల ఆకాంక్షలకు, జాతీయవాదానికి రూపురేఖలను కల్పించాయి
జలియన్ వాలాబాగ్ దురంతం
పంజాబ్ లోని అమృత్సర్ లో చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలపటానికి నాలుగు గోడల మధ్య జలియన్ వాలాభాగ్ లో సమావేశమైన 5000 మంది అమాయక నిరాయుధ ప్రజలపై రెజినాల్డ్ డైయ్యర్ అనే బ్రిటీష్ సైనికాధికారి ప్రధాన ధ్వారాన్ని మూసివేసి విచక్షణా రహితంగా కాల్పులకు ఆదేశించాడు. మొత్తం 1,651 మార్లు చేసిన కాల్పులలో 379 మంది ప్రజలు మరణించారని 1,137 మంది గాయపడినారని బ్రిటీష్ వారి అధికారిక అంచనా. అయితే మొత్తం 1,499 మందిదాకా మరణించారని భారతీయుల అంచనా.ఈ దారుణ మారణకాండతో స్వపరిపాలనపై మొదటి ప్రపంచ యుద్ధసమయంలో భారతీయులలో చిగురించిన ఆశలు అడియాశలైనాయి

భారత్ కు గాంధీ ఆగమనం

మోహన్ దాస్ గాంధీ దక్షిణాఫ్రికాలో జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన నాయకుడు. భారత దేశంలో నిరంకుశమైన రౌలట్ చట్టం, కూలీల పట్ల వివక్షనూ వ్యతిరేకిస్తూ తన గళాన్ని వినిపించాడు. ఈ ఆందోళనల సమయంలో గాంధీజీ సత్యాగ్రహం అనే ఉద్యమాన్ని తెరపైకి తీసుకుని వచ్చాడు. దీనికి స్ఫూర్తి పంజాబ్ ప్రాంతంలో 1872 లో బాబా రామ్ సింగ్ ప్రారంభించిన కూకా ఉద్యమం. ఈ ఉద్యమాలు ముగిసే సమయానికి దక్షిణాఫ్రికాలో జాన్ స్మట్స్ నాయకత్వంలోని ప్రభుత్వం నిరంకుశ చట్టాలను అధికారికంగా వెనక్కు తీసుకుంది.
మహాత్మా గాంధీ చేసినఉద్యమాలు

1.సహాయ నిరాకరణోద్యమాలు

2.ఉప్పు సత్యాగ్రహం

3.క్విట్ ఇండియా


విప్లవ పోరాటాలు

చంద్రశేఖర్ అజాద్, భగత్ సింగ్, సుఖ్ దేవ్,రాజ్ గురు,సుభాస్ చంద్ర బోస్ చేసిన పోరాటములు.