Kachagani Madhusudan

My photo
HYDERABAD, TELANGANA, India
Welcome to motivationaldriveship, my very own passion project filled with unique and engaging content. Explore my site and all that I have to offer; perhaps motivationaldriveship will ignite your own passions as well. Thanks& Regards Kachagani madhusudan

Friday 17 August 2018

మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయీ ఆరోగ్యం మరింత క్షీణించింది.నిన్నటితో అయన ఆయన ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమించిందని దిల్లీలోని ఎయిమ్స్‌ వర్గాలు బుధవారం రాత్రి విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన ప్రాణాధార వ్యవస్థపై ఉన్నారని తెలిపాయి. 93 ఏళ్ల మాజీ ప్రధానిని పరామర్శించడానికి ప్రధాని నరేంద్రమోదీ బుధవారం రాత్రి ఎయిమ్స్‌కు వచ్చివెళ్లారు. చికిత్స పొందుతున్న భాజపా అగ్రనేత వద్దకు తొలుత కేంద్ర జౌళిశాఖ మంత్రి స్మృతి ఇరానీ వెళ్లి, ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు. ఆ తర్వాత ప్రధాని వెళ్లి, వైద్యుల నుంచి సమాచారం తెలుసుకున్నారు. రాత్రి పొద్దుపోయాక రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌, భాజపా ఎంపీ మీనాక్షి లేఖి కూడా ఎయిమ్స్‌కు వెళ్లి వాజ్‌పేయీ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. మధ్యాహ్నం నుంచే ఎయిమ్స్‌కు తాకిడి పెరిగింది. శిఖర సమానుడైన అభిమాన నేత ఆరోగ్యం మెరుగుపడడం లేదని తెలిసినప్పటి నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు ఆత్రుతతో ఆయన గురించి సమాచారం తెలుసుకొనే ప్రయత్నాలు చేశారు. మంత్రులు, ప్రధాని ఒకరి తర్వాత ఒకరుగా ఆసుపత్రికి వస్తుండడంతో వారిలో ఆందోళన మరింత పెరిగింది. రాత్రి సుమారు 7 గంటలకు ఆసుపత్రి వద్దకు చేరుకున్న ప్రధాని దాదాపు ఒక గంట అక్కడే ఉన్నారు. ‘దురదృష్టవశాత్తూ వాజ్‌పేయీ ఆరోగ్యం క్షీణించింది. ఆయన క్లిష్ట పరిస్థితిల్లో ఉన్నారు’ అంటూ ఎయిమ్స్‌ నుంచి బులెటిన్‌ విడుదలయ్యాక ఆయన అభిమానులు ఇంకా కలవరపడ్డారు. వాజ్‌పేయీ అనారోగ్యంతో జూన్‌ 11వ తేదీన ఎయిమ్స్‌లో చేరారు. మధుమేహం, ఛాతీలో అసౌకర్యం, మూత్రపిండాల/ మూత్ర నాళాల సంబంధిత సమస్యలతో పాటు చిత్త వైకల్యం (డెమెన్షియా)తో ఆయన బాధ పడుతున్నారు.
2001 లో ముంబైలోని బ్రేచ్ కాండీ హాస్పిటల్లో వాజ్పేయి మోకాలి మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. ఆయన 2009 లో స్ట్రోక్ను ఎదుర్కొన్నారు, ఇది అతని ప్రసంగం బలహీనపడింది. అతని ఆరోగ్యం ఆందోళనలకు ప్రధాన వనరుగా ఉంది మరియు అతను తరచుగా వీల్ చైర్కు పరిమితమై, ప్రజలను గుర్తించడంలో విఫలమౌతున్నాడని తెలుసు. అతను చిత్తవైకల్యం మరియు దీర్ఘకాలిక మధుమేహం బాధపడుతున్నట్లు చెబుతారు. ఇటీవల సంవత్సరాల్లో బహిరంగ కార్యక్రమానికి హాజరుకాలేదని ఆయనకు తెలియదు. అఖిల భారత ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో తనిఖీలు తప్ప, అతను అరుదుగా ఇంటి నుంచి బయటపడతాడు. 2018 జూన్ 11 న, వాజ్పేయి క్లిష్ట పరిస్థితిలో ఆసుపత్రిలో చేరారు.

మాజీ ప్రధాని, రాజనీతిజ్ఞుడు, భారత రత్న అటల్ బీహారి వాజ్‌పేయి మరణంతో యావత్ భారతీయులు దు:ఖసాగరంలో మునిగిపోయారు. గత కొద్దికాలంగా డయాబెటిస్, కిడ్నీ, అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న వాజ్‌పేయి గురువారం సాయంత్రం 5.05 గంటలకు న్యూఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్‌లో తుదిశ్వాస విడిచారు.
 



No comments:

Post a Comment