Kachagani Madhusudan

My photo
HYDERABAD, TELANGANA, India
Welcome to motivationaldriveship, my very own passion project filled with unique and engaging content. Explore my site and all that I have to offer; perhaps motivationaldriveship will ignite your own passions as well. Thanks& Regards Kachagani madhusudan

Sunday 19 August 2018

How to control Mobile Addiction in Kids | Effects of Mobile Phones on Children


https://www.youtube.com/watch?v=V-eKTkWxp3A

సాంకేతిక పరిజ్ఞానం వచ్చిందని సంతోష పడాలో.. దాని వల్ల సంభవిస్తున్న దుష్ఫలితాలకు భయపడాలో తెలియని పరిస్థితి. చిన్న పిల్లాడి నుంచి ముదుసలి వారి వరకు ఇప్పుడు సెల్‌ఫోన్‌ తప్పని సరి మరి. అది లేందే పూట గడవని పరిస్థితి. గంటల తరబడి మాట్లాడే యువతీ, యువకులు సెల్‌ వలయంలో చిక్కుకుపోతున్నారు. అతిగా సెల్‌ ఫోన్‌లో మాట్లాడడం వల్ల మెదడుకూ ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తు న్నారు. మితిమీరుతున్న మాటల వల్ల రేడియేషన్‌ ప్రభావం పడుతోందని వైద్యులు చెబుతున్నారు. కొత్త దంపతుల్లో పునరుత్పత్తి సామర్ధ్యాన్ని ఈ రేడి యేషన్‌ దెబ్బతీస్తోందని నిపుణులు అంటున్నారు. మరోవైపు ఈ బ్యాన్‌ సంస్థకు చెందిన పలు యాంటీ రేడియేషన్‌ ఉత్పత్తులు సైతం మార్కెట్లోకి అందు బాటులోకి వచ్చాయి. ఈ సెల్‌ రేడియేషన్‌ కారణంగా సంభవిస్తోన్న, ఆరోగ్య సమస్యలను పరీశీలించండి.. మొబైల్ ఫోన్ జేబులోనా...పిల్లలు పుట్టుడు గోవిందా:క్లిక్ చేయండి ప్రస్తుత రోజుల్లో పక్కలో పెళ్ళాం, పిల్లల కంటే మొబైల్ ఫోన్లతో నిద్రపోతున్నారు. నిద్రలేవగానే, తల్లిదండ్రులకు లేదా పిల్లలకు లేదా భాగస్వామికి గుడ్ మార్నిగ్ అని విష్ చేయడం కంటే నిద్రలేవగానే మొబైల్ ఫోన్ ను చెక్ చేయడం ఎక్కువైపోయింది. మొబైల్ వాడకం ఎక్కువగా ఉన్న ఈ జనరేషన్ లో మొబైల్ ఫోన్లు, సరదాలకు, ప్రిస్టేజిలకు అద్దం పట్టేవేలా ఉన్నాయి. అందుకే రోజుకో మోడల్ మొబైల్ ఫోన్ మార్కెట్లోకి విడుదలవుతోంది. కానీ, ప్రతి నిత్యం మొబైల్ ఫోన్లను ఉపయోగించే వారికి, వాటి వల్ల ఏర్పడే భయంకర ఆరోగ్యప్రమాధాల గురించి బహుశా తెలిసుండకపోవచ్చు. కాబట్టి, మనం అందరం ఒక్క నిముషం శ్వాస తీసుకొని ఈ టెక్ టాయ్స్ వల్ల కారణం అయ్యే జబ్బులను ఒక సారి పరిశీలించండి... సెల్ ఫోన్ వాడకంతో తగ్గే షుగర్ వ్యాధి?:క్లిక్ చేయండి స్పెర్మ్ కౌంట్ ను తగ్గిస్తుంది: చాలా మంది మగవారు సెల్ ఫోన్స్ ను ప్యాంట్ ప్యాకెట్ లేదా బెల్ట్ లో వేసుకోవడం వల్ల ఈ ప్రమాదం ఏర్పడుతుందని తాజా అద్యయనాలు పేర్కొన్నాయి. స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడం లేదా స్పెర్మ్ నాణ్యత లోపించడం వంటి ప్రమాధం జరగవచ్చని కొన్ని పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. క్యాన్సర్: మొబైల్ ఫోన్‌లో గంటల తరబడి మాట్లాడుతున్నారా? అయితే మీరు క్యాన్సర్‌తో దోస్తీ చేసినట్లే. మొబైల్ ఫోన్లను పదేళ్లుగా వాడే యుక్త వయస్కులలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఐదు రెట్లు ఎక్కువని స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మొబైళ్ల నుంచి వచ్చే రేడియేషన్ వల్ల మొదడులో కణాలు పెరిగి ప్రాణాంతకమైన ‘గ్లియోమా' అనే కణితులు ఏర్పడి, మెదడు క్యాన్సర్‌కు దారి తీస్తాయని వారు తెలిపారు. అంతేకాకుండా క్యాన్సర్ కణాలు ఉత్పత్తి అవడానికి ఆ రేడియేషన్ ప్రేరేపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధనలో భాగమైన ‘ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్' వెల్లడించింది. కార్పల్ టన్నెల్ సిండ్రోమ్: కొన్ని సందర్భాల్లో అధిక టెక్ట్సింగ్ వల్ల కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ కు దారితీయవచ్చు. చేతికి బాధారకమైన స్థితి ఏర్పడి, మణికట్టు నుండి మెదడుకు గల నాళం దెబ్బతింటుంది. ప్రమాదాలు ఎక్కువ: ఇది ఆరోగ్యానికి ప్రత్యక్షం కానప్పటికీ, పరోక్షంగా కొన్ని ప్రమాదాలకు దారితీస్తోందని కొన్ని స్టడీస్ పేర్కొన్నాయి. ఫోన్లలలో మాట్లాడుతూ ద్విచక్రవాహనాలు, కార్లు నడపడం వల్ల, గోర ప్రమాదాలకు గురిఅవుతున్నారు. డైవ్ చేస్తూనే, మొబైల్లో మెసేజ్ లు లేదా మాట్లాడటం వల్ల ఇలా రోడ్ యాక్సిండెంట్లకు కారణం అవుతోందని వెల్లడి చేస్తున్నాయి. నోమోఫోబియా(Nomophobia):నోమోఫోబియా అంటే ఆత్రుత. కనెక్టివిటీ పెరిగిన కొద్దీ మానసిక ఆదుర్దా అధికమవుతున్నది. పోన్లో బ్యాటరీ పూర్తిగా అయిపోయినప్పుడు లేదా నెట్వర్క్ కవరేజ్ లేనప్పుడు మిమ్మల్ని ఆత్రుతకు గురి చేస్తుంది. యంజియం మెడికల్ కాలేజ్ విద్యార్థులు నిర్వహించిన ఒక అధ్యనంలో, ఆధునిక యుగంలో నోమోఫోబియా సమస్య వృద్ధి చెందుతున్నదని సూచించింది. . పిల్లల నుండి ఫోన్ రాకపోతే తల్లుల్లో ఆందోళన మొదలవుతోంది. పిల్లలకి ఏమైందోనన్న భయం వీరి ఆరోగ్యాన్ని చెడగొడుతోంది. మొబైల్ ఉండి ఫోన్ చేయని పిల్లల్ని తల్లిదండ్రులు, భర్తల్ని భార్యలు తప్పుపడుతున్నారు. ఇది వారి మధ్య ఘర్షణను పెంచుతోంది. మెదడు మీద: మొబైల్ ఫోన్లకు ప్రాణాంతకమైన బ్రెయిన్ ట్యూమర్ - మెదడు కణితి-కు ఉన్న సంబంధం గురించి సంక్లిష్ట సమీక్షను నిర్వహించారు. ఈ పరిశోధనలో, మొబైల్ ఫోన్లను 10 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉపయోగించినట్లయితే బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం రెట్టింపు కానుందని కనుగొన్నారు. మెదడులోని రక్త ప్రసరణపై ప్రభావం చూపి బ్రెయిన్‌ ట్యూమర్‌, కేన్సర్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయి. జ్ఞాపక శక్తి మందగించే అవకాశమూ ఉందిమొబైల్ ఫోన్‌లు కొంత మేర వేడిని ఉత్పత్తి చేస్తాయి. ఈ ప్రభావం మెదడును తాకే అవకాశ ముంది. కాబట్టి మొబైల్ ఫోన్‌‍ను మితంగా ఉపయోగించటం మంచది. బ్లడ్ ప్రెజర్: మొబైల్‌ ఫోన్‌ని మితిమీరి వాడితే మీ రక్తపోటు పెరుగుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. మొబైల్‌ వాడకం బిపి పెరుగుదలకు, తత్పలితంగా గుండె సమస్యలకు కారణం కావచ్చని వైద్యులు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. నిద్రలేమి: మొబైల్ వాడకం పెరిగినకొద్దీ జీవన నాణ్యత తగ్గిపోతుంది. మొబైల్ పక్కన లేకుండా పడుకోలేని పరిస్థితి వస్తోంది. ఏ క్షణంలో మొబైల్ మోగుతోందోనన్న భయం నిద్రలోనూ అనుభవిస్తున్నారు. చిన్న శబ్దానికి కూడా మొబైల్ రింగ్ అనుకుని లేస్తున్నారు. దీనివలన నిద్ర తగ్గుతుంది. చెవిపోటు: మరోవైపు మొబైల్‌ని ఎక్కువగా ఉపయోగించేవారిలో వినికిడి సమస్య వస్తోంది. ధ్వనుల మధ్య ఉన్న తేడాలను పసిగట్టలేకపోతున్నారు. చెవులకు ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయంటున్నారు వైద్యులు. చెవిలోని కాక్లియా, కర్ణభేరిలపై తీవ్ర ప్రభావం చూపడంతోపాటు చెవిలోని హెచెర్‌ సెల్స్‌ను దెబ్బతీయడంతో వినికిడిలోపం, చర్మవ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. తలనొప్పి, కళ్ళు తిరగడం: సెల్ ఫోన్లో అధికంగా మాట్లాడే వారిలో తలనొప్పి, కళ్ళు తిరగడం, అసౌకర్యం అనుభూతిని కలిగిస్తాయి. తల తిరగడం, కళ్లు బైర్లుకమ్మడం, ఆకలి మందగించడం, ఆందోళన వంటి కొత్త రుగ్మతలు కనిపిస్తాయి గుండె మీద ప్రభావం: ఫోన్లకు తప్పనిసరిగా కవర్‌ ఉండాలి. బెల్డ్‌ పౌచ్‌లోనే ఫోను ఉండాలి. జేబుల్లో పెట్టుకోవడం వల్ల రేడియేషన్‌ గుండెపై ప్రభావం చూపుతుంది చిన్న పిల్లల్లో: ముఖ్యంగా ఈ సెల్ ఫోన్ల పిల్లలు ఎక్కువగా అనారోగ్యం పాలు అవుతున్నారని వారు పేర్కొంటున్నారు. గేమ్స్ ఆడడం, పాటలు వినడం, సినిమాలు చూడడంలో పిల్లలు సెల్ ఫోన్స్ని ఎక్కువగా వాడుతున్నారు. మూడు సంవత్సరాల వయసు కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలకి సెల్ ఫోన్స్ ని దూరంగా ఉంచడం చాలా మంచిదని నిపుణులు, డాక్టర్లు చెబుతున్నారు. సెల్ ఫోన్ లు రిసీవ్ చేసుకునే సిగ్నల్స్ కారణంగా రేడియో ధార్మికత వల్ల చిన్న పిల్లల్లో మెదడుకి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాలు ఎక్కువగా ఉన్నాయి. వారి ఆలోచనా శక్తి క్రమేపీ మోద్దుబారే ప్రమాదం ఏర్పడుతోందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. పునరుత్పత్తి సమస్యలు: మితిమీరుతున్న మాటల వల్ల రేడియేషన్‌ ప్రభావం పడుతోందని వైద్యులు చెబుతున్నారు. కొత్త దంపతుల్లో పునరుత్పత్తి సామర్ధ్యాన్ని ఈ రేడి యేషన్‌ దెబ్బతీస్తోందని నిపుణులు అంటున్నారు.

No comments:

Post a Comment