Kachagani Madhusudan

My photo
HYDERABAD, TELANGANA, India
Welcome to motivationaldriveship, my very own passion project filled with unique and engaging content. Explore my site and all that I have to offer; perhaps motivationaldriveship will ignite your own passions as well. Thanks& Regards Kachagani madhusudan

Thursday 9 August 2018

RIP Karunandhi |తమిళనాడు రాజకీయ భీష్ముడు

తమిళనాడులోనే కాదు, సమకాలీన దేశరాజకీయాల్లో అగ్రగణ్యుడు కరుణానిధి. 94 leader .. 50 years పైగా తమిళనాడు రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. ఐదు సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన, 13 సార్లు వరుసగా అసెంబ్లీకి ఎన్నికై ఉదయ సూర్యుడిలా ప్రకాశించిన అరుదైన నాయకుడు. డీఎంకే కార్యకర్తలు అభిమానంగా పిలుచుకునే కలైంజర్ ప్రత్యేకతల్లో కొన్ని చూద్దాం.
  • 1949లో ద్రవిడ మున్నేట్ర కజగం వ్యవస్థాపకుల్లో ఒకరు. అన్నాదురైతో కలసి పార్టీని ఏర్పాటు చేశారు. దేశంలోని పాత పార్టీల్లో డీఎంకే కూడా ఒకటి.
  • ద్రవిడ మున్నేట్ర కజగం అనే పార్టీకి 50 ఏళ్లుగా ఆయనే అధ్యక్షుడు. 1969 జూలై 27న డీఎంకే అధినేతగా పగ్గాలు చేపట్టారు. ఇప్పటి వరకు కరుణానిధి ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నారు.
  • దేశంలో అత్యంత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు. 80 ఏళ్లుగా ఆయన రాజకీయాల్లో ఉన్నారు. మరెవరీకి ఇంత సుదీర్ఘమైన పొలిటికల్ కెరీర్ లేదు.
  • ఐదు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1969-71, 1971-74, 1989-91, 1996-2001, 2006-2011 మధ్య తమిళనాడు సీఎంగా సేవలు అందించారు.
  • 33 ఏళ్ల వయసులో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దేశంలో 13సార్లు వరుసగా అసెంబ్లీకి ఎన్నికైన ఒకే ఒక్క శాసనసభ్యుడు.
  • పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లోనూ గెలిచిన రికార్డు కలైంజర్ సొంతం. ఏ నియోజకవర్గ నుంచి పోటీ చేసినా విజయం సాధించిన నేత.
  • 2004 లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులోని 39, పాండిచ్చేరిలోని ఒక ఎంపీ సీట్లు గెలిచి యూపీఏ-1 ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు.

No comments:

Post a Comment